farewell picture: ఇజ్రాయిల్ బందీలని చంపుతున్న హమాస్.. 48 మంది చివరిఫొటో ఇదే!

గాజా నగరంపై ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూపు హమాస్ ఓ సంచలన ప్రకటన చేసింది. తమ అదుపులో ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీల 'ఫెయిర్‌వెల్' విడుదల చేసింది. 48మందిని చివరి ఫొటో అని హమాస్ ఆ ఫోస్ట్‌లో పేర్కొంది.

New Update
farewell picture

గాజా నగరంపై ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూపు హమాస్ ఓ సంచలన ప్రకటన చేసింది. తమ అదుపులో ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీల 'ఫెయిర్‌వెల్' విడుదల చేసింది. 48మందిని చంపుతామని, ఇదే వారి చివరి ఫొటో అని హమాస్ ఆ ఫోస్ట్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మొండి పట్టుదల కారణంగా ఈ చిత్రం విడుదల చేయాల్సి వచ్చిందని హమాస్ ఆరోపించింది.

ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ప్రజలు, బందీల కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలోని బందీల ముఖాలు బాధతో, నిస్సహాయతతో ఉన్నట్లు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది హమాస్ ఓ రాజకీయ అస్త్రంగా వాడుతోందని, ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి, బందీల భద్రతకు ముప్పు ఉందని హమాస్ పదేపదే హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే పలువురు బందీలు మరణించారని కూడా హమాస్ ఆరోపిస్తోంది. ఈ సంఘటన ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న చర్చలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. హమాస్ తమ వద్ద ఉన్న బందీలందరినీ పాలస్తీనా ఖైదీలందరికీ బదులుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే, నెతన్యాహు ప్రభుత్వం ఆ డిమాండ్లను తిరస్కరిస్తోంది.

గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులు, మానవతా సంక్షోభం, బందీల భవితవ్యంపై పెరుగుతున్న ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఈ యుద్ధాన్ని ఆపడానికి, బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి ఇంకా ఫలితాలను ఇవ్వలేదు. బందీల కుటుంబాలు, ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాల కోసం, బందీల సురక్షితమైన విడుదలకు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు