Trump Warning: తొందరగా తేల్చి చెప్పండి...లేకపోతే తీవ్ర పరిణామాలు..హమాస్ కు ట్రంప్ హెచ్చరిక

గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. హమాస్ కూడా తొందరగా ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నారు. 

New Update
trump warning (1)

తాను రూపొందించిన 21 శాంతి సూత్రాల ప్రణాళికకు తొందరగా అంగీకారం తెలపాలని...లేకపోతే తవ్ర పరిణామలను ఎదుర్కోవలసి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ హమాస్ ను హెచ్చరించారు.  ఒప్పందానికి అంగీకరించకుంటే ముగింపు విషాదంగా ఉంటుందని అన్నారు.  వౌట్ హౌస్ బయట జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ హెచ్చరికలను జారీ చేశారు.

హమాస్ తప్ప అందరూ అంగీకారం.. 

మరోవైపు ట్రంప్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ తో సహా భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించాయి. ముస్లిం దేవాలు కూడా ఒకే అన్నాయి. ఇప్పుడు హమాస్ ఒక్కటే అంగీకారం తెలపాలి. మూడు, నాలుగు రోజులు వెయిట్ చేస్తామని...లేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. అప్పుడు ఇజ్రాయెల్ ను ఆపడం ఎవరి తరం కాదని..అదే చేయాలో చేస్తుందని చెప్పారు. 

గాజా(Gaza) లో యుద్ధాన్ని ముగించడమే కాకుండా..పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని నెతన్యాహు కోరారు. అమెరికా చెప్పినవన్నీ ఒప్పుకుంటానని...కానీ హమాస్(hamas) నుంచి తమకు ఎటువంటి హానీ జరగకూడదని చెప్పారు.  ఒప్పందంలో భాగంగా మొదట గాజా నుంచి తమ సైన్యాన్ని దశల వారీగా వెనక్కు రప్పిస్తామని తెలిపారు.  అందుకు తగ్గట్టుగానే హమాస్ కూడా 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. అలాగే ఆ సంస్థ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి.

Advertisment
తాజా కథనాలు