/rtv/media/media_files/2025/06/04/FYfSaGvsjMkeJPdU9lPG.jpg)
Toronto shooting
Toronto Shooting: కెనడాలో(Canada) గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టోరంటో ఉత్తర యార్క్‌లోని లారెన్స్ హైట్స్ ప్రాంతంలో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. టొరంటో పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నివాస ప్రాంతంలో దుండుగుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్టు పేర్కొన్నారు. నివాస ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
కాగా సంఘటన జరిగిన వెంటనే టొరంటో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై టొరంటో మేయర్ ఒలివియా చౌ స్పందిస్తూ.. ‘లారెన్స్ హైట్స్ ప్రాంతంలో జరిగిన కాల్పులు ఆందోళనకు గురిచేశాయి.. కాగా టొరంటో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ ఉన్న టొరంటో పోలీసులతో మా కార్యాలయం సిబ్బంది టచ్‌లో ఉన్నారు... అలాగే ప్రాదేశిక కౌన్సిలర్, డిప్యూటీ మేయర్ మైక్ కొల్లేతోనూ మాట్లాడాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, టొరంటో పోలీస్, ఫైర్, పారామెడిక్ సేవలకు నా కృతజ్ఞతలు. త్వరలో పూర్తి సమాచారం అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు’ అని ఆమె స్పష్టం చేశారు.
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
కాగా ప్రస్తుతం టొరంటో పోలీస్ విభాగంఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టింది. ఈ కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన టొరొంటో నగరంలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కాల్పులకు దారితీసిన పరిస్థితులు అందుకు గల కారణాలపై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
అమెరికాతో పోలిస్తే కెనడాలో గన్ కల్చర్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో కెనడాలోనూ హింసాత్మక ఘటనలు పెరుగుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు, తుపాకీ సంబంధిత నేరాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..