గాజా దంపతులకు పుట్టిన బిడ్డ పేరు ‘సింగపూర్’.. ఎందుకో తెలుసా?

గాజా స్ట్రిప్‌లో నెలకొన్న భయంకర పరిస్థితుల మధ్య జన్మించిన ఓ నవజాత శిశువుకు పాలస్తీనియన్ దంపతులు 'సింగపూర్' అని పేరు పెట్టారు. ఆపద సమయంలో వారిని ఆదుకున్న దేశం పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు ఈ జంట. సోషల్ మీడియాలో వీరిపై ప్రసంశల వర్షం వెల్లువెత్తుతున్నాయి.

New Update
newborn 'Singapore'

గాజా స్ట్రిప్‌లో నెలకొన్న భయంకర పరిస్థితుల మధ్య జన్మించిన ఓ నవజాత శిశువుకు పాలస్తీనియన్ దంపతులు 'సింగపూర్' అని పేరు పెట్టారు. ఆపద సమయంలో వారిని ఆదుకున్న దేశం పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు ఈ జంట. యుద్ధం కారణంగా ఆహార కొరత, భయం వెంటాడుతున్న సమయంలో తమ కుటుంబానికి ఆహారాన్ని అందించిన సింగపూర్‌కు కృతజ్ఞతా చిహ్నంగా ఈ పేరు పెట్టినట్లు దంపతులు తెలిపారు. ఈ శిశువు తండ్రి, హమ్దాన్ హడాద్, సింగపూర్‌కు చెందిన 'లవ్ ఎయిడ్ సింగపూర్' అనే స్వచ్ఛంద సంస్థ గాజాలో నడుపుతున్న ఓ కిచెన్‌లో వంటవాడిగా పనిచేస్తున్నారు. గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన సమయంలో, ఈ వంటశాల నుండే ఆయన భార్య గర్భధారణ సమయంలో భోజనాన్ని తీసుకెళ్లాడు. ఆ సహాయం తమ కుటుంబానికి ఒక జీవనాధారంలా నిలిచిందని, అందుకే ఆ దేశంపై తమకున్న ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి తమ కుమార్తెకు 'సింగపూర్' అని పేరు పెట్టినట్లు హమ్దాన్ హడాద్ తెలిపారు.

శిశువు పుట్టిన తర్వాత, 'లవ్ ఎయిడ్ సింగపూర్' సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బిడ్డ బర్త్ సర్టిఫికేట్ పంచుకుంది. గాజాలో 'సింగపూర్' అనే పేరు పెట్టిన మొదటి పాలస్తీనియన్ బిడ్డ ఈమే కావచ్చు అని పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. యుద్ధం, కరువు మధ్య ఆశ, దయ అనేవి సరిహద్దులు దాటి ఎలా సహాయపడతాయో ఈ సంఘటన నిరూపించింది. సింగపూర్ సంస్థ అందించిన చిన్న సహాయం, ఒక కుటుంబానికి ప్రాణాలను నిలిపి, చివరకు ఒక చిన్నారి పేరు ద్వారా ఆ దేశంతో పంచుకోలేని బంధాన్ని ఏర్పరుచుకునేలా చేసింది.

Advertisment
తాజా కథనాలు