Musk: భవిష్యత్తులో యుద్దాలన్ని డ్రోన్లతోనే అంటున్న మస్క్! ఆధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.భవిష్యత్తు యుద్దాలు డ్రోన్‌లతోనే జరుగుతాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. By Bhavana 26 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ డోజ్ సంయుక్త సారథులుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మస్క్ పలు సూచనలు ఇచ్చారు. Also Read: ఇదేం వింత రూల్ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాలంటే రక్తంతో సంతకం చేయాల్సిందే ఆధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని పేర్కొన్నారు.భవిష్యత్తు యుద్దాలు డ్రోన్‌లతోనే జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.డ్రోన్ ల వినియోగ కాలంలో మానవ సహిత ఫైటర్ జెట్ లను వాడటం లేదు. Also Read: త్వరలో మహా కుంభమేళా.. మొదటిసారిగా రోబోలతో ఎందుకంటే అవి ఫైలట్ లను చంపేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది ఎఫ్ -35వంటిమనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు. అయితే ఆ డిజైన్ లు నేటి అవసరాలకు అనుగుణంగా లేవు అని మస్క్ రాసుకొచ్చారు. Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు ఎఫ్ -35 ఫైటర్ జెట్ లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలు. దీనిలో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫైటర్ జెట్ పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ల రూపకల్పనలో దాని నిర్వహణ ఖర్చులు వంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటుంది. Also Read: కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు! ఈ క్రమంలోనే మస్క్ ఎఫ్ -35 ఫైటర్ జెట్ లను వ్యతిరేకిస్తూ పోస్టు పెట్టడం గమనార్హం. ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు బిగ్ షాక్ ట్రంప్ వివిధ దేశాల నుంచి దిగుపతి అయ్యే వస్తుల సుంకాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. '' జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఒకటిగా మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చేటటువంటి అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించేందుకు అవసరమైన డాక్యుమెంట్స్‌పై సంతకం చేస్తానని'' చెప్పారు. దీంతోపాటు చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. ట్రంప్ ఆర్థిక అజెండాలో సుంకాలు కీలకంగా ఉన్నాయి. తాను అధ్యక్షుడిగా అయ్యాక వివిధ దేశాల నుంచి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకాలు విధిస్తానని చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆయన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఈ సుంకాలు దేశ వృద్ధిని దెబ్బతీస్తాయని, అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచుతాయని పలువురు ఆర్థకవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే కెనడా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించడాన్ని కెనడా నేత జిగ్మిత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. సుంకాలు పెంచినట్లు ఉన్న వార్తను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం దేశం కోసం నిలబడాలని, సుంకాల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి