/rtv/media/media_files/2025/04/09/aTZlR5fUPa5nvzb8XWkm.jpg)
Students In USA
రీసెంట్ గా అమెరికాకు వచ్చే విద్యార్థుల వీసాలను ఇంటర్వ్యూలను నిలిపేసింది. దీంతో వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆందోళన లో పడిపోయింది. తమ కలలు...కల్లలుగానే మిగిలిపోవాలని విద్యార్థులందరూ బాధలో కూరుకుపోయారు. అయితే మళ్ళీ అమెరికా వారికి తీపి కబురు చెప్పింది. వీసా ప్రక్రియ శాశ్వతంగా ఆగిపోలేదని..మళ్ళీ దానిని రెన్యూ చేస్తామని తెలిపింది. స్లాట్ల కోసం రోజూ చెక్ చేసుకోండి అని చెప్పింది. త్వరలోనే ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.
సాఫ్ట్ వేర్ అప్డేట్ కోసమే..
వెంటనే ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మొదలవదు కానీ త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చింది. ఎప్పుడు ఓపెన్ అవుతాయో కచ్చితంగా చెప్పలేమని...తరచుగా స్లాట్లను చెక్ చేసుకోవాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వివరించారు. జాతీయ భద్రత కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వీసా ప్రక్రియలో ఇందులో చాలా ముఖ్యమైనది అని అన్నారు. విద్యార్థుల సోషల్ మీడియా తనిఖీలు చేసేందుకే ఇంటర్వ్యూలను నిలిపివేశామని తెలిపారు. తనిఖీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసామని చెప్పారు.
Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్