పదేళ్ల క్రితం ఐసీస్ (ISIS) చేతిలో బందీగా ఉండి, ఇటీవలే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సాయంతో విడుదలైన ఫౌజియా అమీన్ సిడో అనే యువతి తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. లెబనాన్ భూభాగంలో ఆమెను గుర్తించి ఇజ్రాయెల్ సైన్యం ప్రాణాలతో ఐసీస్ నుంచి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ఫాజియా.. ఐసిస్ 2014లో 200 మంది మహిళలు, పిల్లలను బానిసలుగా చేసుకుందని.. వారిలోనే తానూ, తన సోదరులు ఉన్నట్లు ఫౌజియా తెలిపారు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్లని చెప్పారు. అంతేకాదు యజిదీ శిశువులను చంపి వారి మాంసాన్ని తమకు వండి పెట్టినట్లు చెబుతూ కన్నీరు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్
చిన్నారులను చంపి వండిన ఫొటోలు..
‘టెర్రరిస్టులు మమ్మల్ని బంధించిన మొదటి మూడు రోజులు ఆహారం పెట్టలేదు. అయితే ఆ తర్వాత మాకు పెట్టిన అన్నంతోపాటు మాంసం దుర్వాసన వచ్చింది. అది తిని చాలామంది అనారోగ్యం బారిన పడ్డాం. ఆ మాంసం యజిదీ శిశువులదని ఐసీస్ ఉగ్రవాదులు చెప్పారు. చిన్నారులను చంపి వండిన ఫొటోలను చూపించారు. మీ పిల్లలను మీరే తిన్నారంటూ రాక్షసంగా వ్యవహరించారు. దీంతో ఓ మహిళ కనిపించకుండా పోయిన తన బిడ్డలను గుర్తు చేసుకొని కొన్ని క్షణాల్లోనే చనిపోయింది' అంటూ ఫౌజియా తెలిపింది.
ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు
జిహాదీ ఉగ్రవాదులకు విక్రయం..
ఇక ఇన్నేళ్లకు ఇజ్రాయెల్ సైన్యం తనను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. భూగర్భ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉంచి, కలుషిత తాగునీరు ఇవ్వడంతో ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. అనంతరం తన పేరును ‘సబయా’ గా మార్చి జిహాదీ ఉగ్రవాదులకు విక్రయించారని.. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. కానీ తన పిల్లలు ఇప్పటికీ ఐసిస్ చేతిలోనే అరబ్ ముస్లింలుగా పెరుగుతున్నారని ఎమోషనల్ అయింది.
Also Read : ఉపవాస సమయంలో బంగాళాదుంప తింటే ఏమవుతుంది?
Also Read : యుద్ధానికి సిద్ధమవ్వండి.. జిన్‌పింగ్ సంచలన ప్రకటన