EUROPE WAR: యూరప్ Vs రష్యా.. మరో యుద్ధానికి సిద్ధం!

ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రష్యా దూరం పెడుతోంది.

New Update
Germany_WWII_Anniversary_Elbe_Da

EUROPE WAR: ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రష్యా దూరం పెడుతోంది. దీంతో యూరప్ రష్యా మధ్య వార్ ముదురుతున్నట్లు తెలుస్తోంది. రష్యా యుద్ధానికి వస్తే కలబడి నిలబడటంకోసం జర్మనీ సైనిక బలం పెంచుకుంటోంది. 

Also Read:Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు

2029 నాటికి 95 బిలియన్ డాలర్ల నుంచి 162 బిలియన్ డాలర్లకు జర్మనీ సైనిక బడ్జెట్ ను పెంచింది. యూకే, ఫ్రాన్స్ కంటే ఎక్కువగా సైనిక బడ్జెట్ కేటాయించడం సంచలనం రేపుతోంది. రష్యాతో యుద్ధం జరిగితే యూరప్‌ను జర్మనీ ముందుండి నడిపించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు అమెరికాను పూర్తిస్థాయిలో నమ్ముకోకుండా యూరప్ స్కెచ్ వేస్తోంది. అయితే యూరప్ బెదిరింపులను తాము పట్టించుకోవట్లేదని రష్యా తేలికగా తీసేస్తోంది. నాటో దేశాలు మా సైన్యం బలాన్ని గుర్తు పెట్టుకోవాలని, యుద్ధంలోకి దిగితే యూరప్ అంతం అవుతుందని రష్యా హెచ్చరిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు