సీజేఐ పేరుతో ఉత్తర్వులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాల్లు!

సైబర్ నేరస్థుల ఉచ్చులో వైద్యురాలు చిక్కుకుంది. మీ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాడు బెదిరించాడు. సీజేఐ పేరుతో ఉత్తర్వులు కూడా తీసుకున్నట్లు తెలిపాడు. ఆపై విడతల వారీగా రూ.3 కోట్లు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.

New Update
CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ఈ మధ్య కాలంలో సైబర్ నేరస్థుల ఆగడాలు పెరిగిపోయాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు రకరకాల ప్లాన్‌లు వేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, సంపన్న ఉద్యోగులే లక్షంగా చేసుకుంటున్నారు. మనీలాండరింగ్ జరిగిందంటూ, మీ పేరుతో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు ఫోన్‌లు చేస్తున్నారు. ఆపై డిజిటల్ అరెస్టు అంటూ బెదిరించి డబ్బులు కొట్టేస్తున్నారు.

Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

వైద్యురాలి నుంచి రూ.3 కోట్లు కొట్టేశారు

ఇప్పటికి ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. తమ పేరుతో మనీలాండరింగ్ జరిగిందంటూ హైదరాబాద్‌లోని ఓ వైద్యురాలి నుంచి ఏకంగా రూ.3 కోట్లు కొట్టేశారు. 3 రోజుల్లో ఫోన్ చేస్తామంటూ నమ్మించారు. ఎన్ని రోజులైన కాల్ రాకపోయే సరికి మోసపోయానని గుర్తించిన ఆ వైద్యురాలు పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ వైద్యురాలికి అక్టోబర్ 14వ తేదీన ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను టెలికాం విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఉన్న మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్‌తో మనీలాండరింగ్ జరిగిందని అన్నాడు. ఢిల్లీలోని సురేష్ కుటే సహా మరింకొందరితో కలిసి అక్రమ డబ్బు ట్రాన్సఫర్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు సైతం ఉన్నాయంటూ కాస్త బెదిరించాడు. 

Also Read :  'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. చూస్తే షాకవుతారు!

ఆ తర్వాత వీడియో కాల్‌లోకి తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ శశాంక్ జైస్వాల్ అనే పేరుతో మాట్లాడాడు. మీ పేరుతో మనీలాండరింగ్ జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నమ్మించాడు. అలాగే విచారించేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి కూడా ఉత్తర్వులు ఉన్నాయని కొన్ని డాక్యుమెంట్స చూపించాడు. 

అనంతరం బ్యాంకు ఖాతా వివరాలు, డిపాజిట్లు ఇవ్వకపోతే మీ భర్త, కుమారుడు సమస్యల్లో ఇరుక్కుంటారని ఆ వైద్యురాలిని బెదిరించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే వివిధ ఖాతాలకు డబ్బులు ట్రాన్సఫర్ చేయాలని సూచించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ వైద్యురాలు తన భర్త, కుమారుడి అకౌంట్ వివరాలు, ఉద్యోగం, ఆదాయం వంటి ఇతర వివరాలను అతడికి తెలిపింది. 

Also Read :  రేవంత్‌ కుట్రలకు భయపడేది లేదు: KTR

ఈ విచారణ జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని .. ఎవరికీ చెప్పవద్దని.. చెబితే అందరూ చిక్కుల్లో ఇరుక్కుంటారని బెదిరించాడు. ఆ పై అక్టోబర్ 14 నుంచి 23వ తేదీ వరకు విడతల వారీగా రూ.3 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. ఈ కేసుకు మీకు ఎటువంటి సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో మళ్లీ తిరిగి మీ డబ్బును మీకు బదిలీ చేస్తామని నమ్మించాడు. ఇక మూడు దాటిన వారి నుంచి ఫోన్ రాకపోయే సరికి మోసపోయినట్లు గుర్తించిన ఆ వైద్యురాలు వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు