ఈవీఎంలను హ్యక్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కామెంట్స్‌తో ఇండియాలో రచ్చ!

ఈవీఎంలపై ఎలోన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు యంత్రాలపై విశ్వాసం లేదని, అన్ని దేశాల్లో బ్యాలెట్ పేపర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. మనుషులు లేదా ఏఐ ద్వారా ఈవీఎం హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

fdrefre
New Update

Elon Musk: బిజినెస్ టైకూన్ ఎలోన్ మస్క్ మరోసారి ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. ఏ దేశంలోనైనా అధ్యక్ష ఎన్నికల కోసం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఎందుకంటే తనకు యంత్రాలపై విశ్వాసం లేదని, అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానం పెట్టాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండియాలో పలు రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను (EVM) రద్దు చేయాలని ఎలోన్ మస్క్ పిలుపునిచ్చిన సంగతి తెలిసింతే. కాగా వాటిని మానవులు లేదా AI ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ఆయన మరోసారి హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఎన్నికలకు దూరంగా ఉంచాలి..

ఈ మేరకు ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన టౌన్ హాల్ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూన.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలన్నారు. ఈ ప్రయోజనం గురించి ఆయన వివరంగా చెప్పారు. యంత్రాలకు బదులుగా పేపర్ బ్యాలెట్లను నేను ఇష్టపడతానని,  ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు చేతులతో లెక్కించే బ్యాలెట్ పేపర్ తో జరగాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!

హ్యాక్ చేయడం చాలా సులభం..

'నేను సాంకేతిక నిపుణుడిని.. కంప్యూటర్ల గురించి బాగా తెలుసు. నేను కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను విశ్వసించను. ఎందుకంటే వాటిని హ్యాక్ చేయడం చాలా సులభం. కానీ పేపర్ బ్యాలెట్ హ్యాక్ చేయడం కష్టం. ఒక ఐడితో ఒక వ్యక్తి ఓటు వేయడం ఇది ప్రతి దేశంలో అమలువుతోంది. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగే దాదాపు ప్రతి దేశంలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే తుది ఫలితాలు వెల్లడించాలి. ఇది జరగకపోవడం చాలా విచిత్రం' అని మస్క్ అభిప్రయాయపడ్డారు. ఇక మస్క్ పేపర్ బ్యాలెట్‌కు మద్దతు ఇస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

AI ద్వారా హ్యాక్ చేసే అవకాశం.. 

అయితే ఎన్నికల్లో టెక్నాలజీని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మానవులు లేదా AI ద్వారా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందని, వాటిని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మస్క్ ప్రకటన తర్వాత, మాజీ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈవీఎంలపై ట్యుటోరియల్ నిర్వహించడానికి మస్క్‌కు ఆఫర్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: సిన్వర్‌ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో

ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?

#elections #evm #elon-musk #ballet-votes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe