/rtv/media/media_files/2024/12/06/rvG3KkaPQHsJHMG8pbDg.jpg)
టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీకల నిర్ణయం తీసుకున్నారు. తాను డోజ్ ను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక మీదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో తన జోక్యం ఉండదని చెప్పారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ చెప్పారు. తాను లేకపోయినా డోజ్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశమిచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కు ఎలాన్ మస్క్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీని తరువాత ఆయన వాషింగ్టన్ ను కూడా వీడి వెళ్ళనున్నారు.
1 ట్రిలియన్ డాలర్లను సేవ్ చేశాం..
డోజ్ ద్వారా ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించామని.. కాబట్టి తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెప్పారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు 4బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేశామని మస్క్ చెప్పుకొచ్చారు. DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకమని చెప్పారు. అందుకే DOGE ను వదిలేసానని అన్నారు.
అంతకు ముందు తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు మాత్రం వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే పౌరులు చెల్లిస్తున్న సొమ్ము వృథా అవుతోందని మస్క్ అన్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై DOGE చేస్తున్న ఆడిట్‌లో కీలక విషయాలు బయటపడుతున్నాయని.. ప్రజల డబ్బులు ఎలా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తోందని చెప్పారు.
today-latest-news-in-telugu | Elon Musk | america president trump | us government news
Also Read: KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం
Follow Us