/rtv/media/media_files/2025/04/28/ULROgYsVPxg1xZTzbjJm.jpg)
Elon Musk 3
టెక్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తెలియనిది ఎవరికి. ఈ రోజుల్లో చిన్న పిల్లలను అడిగినా మస్క్ గురించి చెబుతాడు. టెక్ అధిపతిగా గుర్తింపు తెచ్చుకున్న మస్క్ గత కొన్నేళ్ళుగా ప్రపంచ కుబేరుడిగా ఉంటున్నాడు. లాస్ట్ మూడు, నాలుగేళ్ళుగా సంపాదనలో ఇతనిని తలదన్నే వాడు రావడం లేదు. ఇప్పుడు అయితే ఏకంగా ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లి కూర్చొన్నాడు ఎలాన్ మస్క్. తాజాగా 600 బిలియన్ డాలర్లకు అధిపతిగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. ఎలాన్ సృష్టిలో ఒకటైన రాకెట్ తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్ ఐపీఓ విలువ పెరుగుతున్నట్లు వార్తలు రావడంతో మస్క్ సంపద అమాంతం పెరిగింది. ఒక్క రోజులోనే మస్క్ సంపద 168 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో అతని నికర సంపద విలువ 677 డాలర్లుగా అయింది.
ఒక్కసారే హై జంప్..
ఎలాన్ మస్క్ ఎప్పటికప్పుడు తన రికార్డ్ లను తానే బ్రేక్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ ఇతని నికర విలువ 500 బిలియన్ డాలర్లకు చేరింది. 2020 మార్చి నాటికి 24.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన ఆస్తులు.. ఐదేళ్లలోనే 600 బిలియన్ డాలర్లకు చేరింది. ఇంతలా ఇప్పటి వరకు ఏ కుబేరుడూ సంపాదించలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఎలాన్ తర్వాత ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ గతంలో ఓసారి 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్నారు. అది కూడ ఒక్కరోజే నిలిచింది. ఇక స్పేస్ ఎక్స్ లో మస్క్ కు 42 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఐపీఓకు వెళ్ళనుంది. ఇది మొదట్లో 400 బిలియన్ డాలర్ల విలువతో ఐపీఓకు వెళుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా 800 బిలయన్ డాలర్లకు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. దీని కారణంగా ఎలాన్ సంపద విలువ ఒక్కసారే అమాంతంగా పెరిగిపోయింది.
త్వరలోనే ట్రిలియనీర్ గా..
ఇక టెస్లా విషయానికి వస్తే..టెస్లా వాటాదారులకు ప్రకటించిన ప్యాకేజీలతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ గా మారనున్నాడు. కొన్ని రోజుల క్రితం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ వాటాదారులకు ప్యాకేజీలను అనౌన్స్ చేశారు. ఇందులో మస్క్ కు ఏడాదికి ఒక ట్రిలియన్ డబ్బులు అందనున్నాయి. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో 75% కంటే ఎక్కువ షేర్లు పే ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేశాయని టెస్లా ప్రకటించింది. మస్క్ కంపెనీలో 15శాతం వాటాను కలిగి ఉన్నారు. అది ఇప్పుడు 25 శాతానికి పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలా అయితే ఆయన వేతనం రోజుకు 237 మిలియన్ డాలర్లకు చేరుతుంది.
Follow Us