/rtv/media/media_files/2025/07/01/elon-musk-2025-07-01-10-39-30.jpg)
Elon Musk
ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. అత్యంత ధనవంతుల జాబితాలో ఈయన స్థానం నంబర్ వన్. గత కొన్నేళ్ళుగా దీన్ని ఆయన నిలుపుకుంటూనే వస్తున్నారు. అయితే గురువారం నాడు ఎవరూ ఊహించినది జరిగింది. మస్క్ ను వెనక్కు తోసేసి ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ప్రపంచ నంబర్ వన్ కుబేరుడిగా ఎదిగాడు. కేవలం ఒక్కరోజులోనే 110 బిలియన్ డాలర్ల సంపద రాగా..కుబేరుడిగా అవతరించారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవ లేదు. మళ్ళీ ఒక్కరోజులోనే పరిస్థితులు తారుమారు అయ్యాయి. వారు వీరు...వీరు వారు అయ్యారు. లారీ ఎల్లిసన్ ను వెన్కునెట్టేసి ఎలాన్ మస్క్ మళ్ళీ ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.
2021లో ఎలోన్మస్క్ మొట్ట మొదటసారి ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. అప్పటి నుంచా ఆయన కంటిన్యూగా కొనసాుతున్నారు. మధ్యలో 2024లో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కొంతకాలం ఆ స్థానంలోకి వచ్చారు. కానీ మళ్ళీ కొన్నాళ్లకుమస్క్ తన ప్లేస్ ను కైవసం చేసుకున్నారు. దాదాపు 300 రోజులుగా మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
గురువారం అగ్రస్థానంలో లారీ ఎల్లిసన్..
ఎక్స్(X) దిగిపోయింది..టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్(OracleCorporation) పైకెగిసింది. దీంతో టెక్ అధిపతి ఎలోన్మస్క్(ElonMusk) ప్రపంచ కుబేరుడు కిరీటాన్ని కోల్పోయారు. ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా 81 ఏళ్ళ లారీ ఎల్లిసన్ అవతరించారు. దాదాపు 101 బిలయన్ డాలర్ల సంపదతో ఎలోన్మస్క్ ను తోసిరాజన్నారు. ఇంతా కేవలం ఒక్క రోజులోనే జరగడం ఇక్కడ విశేషం. ఎన్నో ఏళ్ళుగా తన స్థానాన్ని పదిలపర్చుకుంటూ వచ్చిన మస్క్ ఒక్క రోజులోనే కిందకు దిగిపోయారు. లారీ ఎల్లిసన్ సంపద విలువ హఠాత్తుగా వన్ డే లోనే 100 బిలయ్లకు పైగా పెరిగింది.
ఈ ఆకస్మిక జంప్ కారణంగా.. న్యూయార్క్‌లో ఉదయం 10:10 గంటలకు ఎల్లిసన్ సంపద $393 బిలియన్లకు చేరుకుంది. దీనితో అతను ఎలోన్మస్క్‌ను అధిగమించి నంబర్ 1 ధనవంతుడు అయ్యాడు. ఎలోన్మస్క్ నికర విలువ $385 బిలియన్లుగా నమోదైంది. ఒకే రోజులో ఏ బిలియనీర్ సంపదలోనూ ఇది అతిపెద్ద జంప్ రాలేదని బ్లూమ్ బర్గ్ చెబుతోంది. ఈ ఏడాది ఒరాకిల్ పెర్ఫామెన్స్గనణీయంగా పెరిగింది. ఈ కంపెనీ స్టాక్స్ కూడా బలమైన పెరుగుదలను నమోదు చేశాయి. స్టాక్స్ వాల్యూ 45% కంటే ఎక్కువ పెరిగాయి. మంగళవారం ఎల్లిసన్ స్టాక్ $241.63 వద్ద ముగిసింది. కానీ బుధవారం అది $319.19 వద్ద తుఫాను వేగంతో పెరిగింది. చివరకు $345.72 దగ్గర ముగిసింది.
Also Read: Pakistan Doctor: నర్స్ తో సెక్స్ కోసం..ఆపరేషన్ ను మధ్యలో వదిలేసిన పాకిస్తాన్ డాక్టర్