/rtv/media/media_files/2026/02/06/wedding-bus-meets-with-accident-in-western-nepal-2026-02-06-09-33-16.jpg)
Eight Killed As Wedding Bus Meets With Accident In Western Nepal
నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. మరో అయిదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి నేపాల్‌లో బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీ 7లో భావానే నుంచి బజాంగ్‌కు ఓ పెళ్లి బస్సు వెళ్తోంది.
Also Read: రాష్ట్రపతిని అవమానించారు.. ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
కొండప్రాంతాలు కావడంతో బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోయాడు. బడ్గౌన్ మోడ్ వద్ద బస్సు లోయలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, సైనిక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన 45 మందిని ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో 16 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. అయితే వధూవరులు ఆ బస్సులో లేకపోడవంతో వాళ్లకు ప్రాణాపాయం తప్పింది.
Also Read: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!
ఇదిలాఉండగా ఇటీవల నేపాల్‌లో రోడ్డుప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7669 ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం ఈ సంఖ్య 5 వేలు మాత్రమే ఉంది. గడిచిన ఏడాదిలో 190 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే రోడ్లపై ప్రయాణాలు చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Follow Us