BREAKING: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

New Update
7.1 earthquake hits Tonga in South Pacific

7.1 earthquake hits Tonga in South Pacific

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఫైజాబాద్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3తో భూమి కంపించినట్లు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం (ఎపిసెంటర్) ఫైజాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది, దీని తర్వాత మరికొన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. 

ఈ భూకంపం కారణంగా ఫైజాబాద్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు నివాసితులు రాత్రంతా భవనాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లోనే గడిపినట్లు సమాచారం. 4.3 తీవ్రత కలిగిన ఈ భూకంపం స్వల్ప స్థాయిలోనే పరిగణించబడుతున్నప్పటికీ, ఇది తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతం కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం లేదా చెప్పుకోదగ్గ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పూర్తి సమాచారం కోసం అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్, ముఖ్యంగా ఫైజాబాద్ ప్రాంతం, భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో ఒకటి. పర్షియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు 4.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఈ తరహా ఘటనలు ఇక్కడి ప్రజలను ప్రతిసారీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు