BIG BREAKING: ట్రంప్ కు ప్రతిష్టాత్మక పీస్ అవార్డ్!

మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పీస్ పురస్కారం దక్కింది. నోబెల్ జ్యూరీ ఆయన కష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదు కానీ రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం గుర్తించింది. ట్రంప్‌ను ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డుతో సత్కరించారు.

New Update
peace award

రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిక తీర్చింది. ప్రతిష్టాత్మక ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డును ఆయనకు బహూకరించింది. 1995లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం తర్వాత స్థాపించబడిన ఈ అవార్డును..శాంతిని ప్రోత్సహించే వాళ్ళకు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. ఇందులో ఒక్క భారత్ తప్ప మిగతా దేశాలన్నీ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి మద్దుతునిచ్చాయి. అయితే నోబెల్ మాత్రం ఆయనను వరించలేదు. కానీ ఇప్పుడు రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం ట్రంప కష్టాన్ని గ్రహించింది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌కు ఈ అవార్డును బహూకరించారు. 

నిక్సన్ ఫౌండేషన్, ట్రంప్ కుటుంబానికి..

ట్రంప్ కుటుంబం, నిక్సన్ ఫౌండేషన్ మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. అక్టోబర్ 19న, ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ తన "అండర్ సీజ్: మై ఫ్యామిలీస్ ఫైట్ టు సేవ్ అవర్ నేషన్" పుస్తకాన్ని నిక్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రమోట్ చేశారు. ఈ కార్యక్రమానికి నిక్సన్ మనవడు క్రిస్టోఫర్ నిక్సన్ కాక్స్ మోడరేట్ చేశారు. దాంతో పాటూ ఎరిక్ ట్రంప్ తన తండ్రి విధానాలు, అధ్యక్ష పదవి గురించి చర్చించారు. దాని తరువాతనే ఫౌండేషన్ ట్రంప్‌కు ఈ బహుమతిని ప్రకటించింది. ఆయనతో పాటూ ఇరాన్ బహిష్కరించిన రాజకుటుంబం కూడా దీన్ని అందుకుంది. 

Advertisment
తాజా కథనాలు