Sudan: భీకర డ్రోన్ దాడి.. 30 మంది మృతి

ఉత్తరాఫ్రికాలోని సుడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దార్ఫర్‌ అనే ప్రాంతంలో ఎల్-ఫశేర్‌లోని శుక్రవారం రాత్రి సౌదీ ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

New Update
Drone Attack in Sudan

Drone Attack in Sudan

ఉత్తరాఫ్రికాలోని సుడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దార్ఫర్‌ అనే ప్రాంతంలో ఎల్-ఫశేర్‌లోని శుక్రవారం రాత్రి సౌదీ ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న 30 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎల్‌-ఫశేర్‌లో చివరిగా ఉన్న సౌదీ ఆస్పత్రి ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఇది కూడా ధ్వంసమైపోయిందని వైద్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 

Also Read: 'యమునా నది శుభ్రం, వారికోసం సంక్షేమ బోర్డు'.. బీజేపీ మూడో మేనిఫెస్టో విడదల

అయితే కొన్ని వారాల క్రితమే ఆ ఆస్ప్రత్రిపైనే పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాలు డ్రోన్లతో దాడి చేసినట్లు అక్కడి వారు చెబుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిపై ఇప్పుడు ఎవరు ఈ డ్రోన్ దాడి చేశారనేదానిపై క్లారిటీ లేదు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. ఇదిలాఉండగా 2023 ఏప్రిల్‌ నుంచి సుడాన్‌లో సంక్షోభం నెలకొంది. అధికారం కోసం ఓవైపు సుడాన్ సైన్యం, మరోవైపు పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాలు మధ్య పోరు సాగుతోంది. ఇప్పుడు జరిగిన ఆస్పత్రిపై ఏ గ్రూప్ దాడి చేసిందనేది తెలియాల్సి ఉంది. 

ఎల్-ఫశేర్‌లో ఆస్పత్రులపై దాడులు చేయడం సాధారణంగా మారిపోయింది. ఇక్కడ అత్యవసర వైద్య సేవలు ఇప్పటికీ అందిస్తున్న చివరి ఆస్పత్రిగా సౌదీ ఆస్పత్రి పనిచేస్తోందని ఇటీవలే వైద్యులు తెలిపారు. ఇప్పుడు అది కూడా ధ్వంసం కావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సూడాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం వైద్య సేవలు అందించలేని పరిస్థితులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.  అయితే సూడాన్‌లో కేవలం వైద్య సౌకర్యాలు మాత్రమే ప్రభావితం కాలేదు. 2024లో సుడాన్‌లో జరిగిన సివిల్ వార్ వల్ల 1.7 కోట్ల మంది చిన్నారులు స్కూళ్లకి వెళ్లడం లేదని ఇటీవల యూనిసెఫ్ వెల్లడించింది. 

Also Read: పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు