Israel : ఇజ్రాయెల్ సోమవారం హెజ్‌బొల్లా పై భారీ స్థాయిలో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిల్ హొసైన్ హొసైనీ ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మంగళవారం ప్రకటించాయి. హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతి సోహిస్ హొసైన్ హొసైనీని ఐడీఎఫ్ హతమార్చింది.
Also Read: పుతిన్ ని కలవను..తేల్చి చెప్పిన కమలా హారీస్!
సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన కచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో హొసైనీ మృతి చెందారని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. కాగా ఈ విషయం పై ఇప్పటి వరకు హెజ్‌బొల్లా నుంచి ఎటువంటి స్పందన లేదు.
Also Read: వెనుకంజలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్
హమాస్ లో కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ హమాస్ పై భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. సోమవారంతో గాజా యుద్దానికి ఏడాది పూర్తవడంతో హమాస్, బీరూట్ పై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా విరామం లేకుండా వైమానిక దాడులకు దిగింది. గాజాలో హమాస్ పైనా ఆదివారం ఐడీఎఫ్ విరుచుకుపడింది.
Also Read: హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. కశ్మీర్ లో విజయం దిశగా కాంగ్రెస్ కూటమి!
దేర్ అల్-బలాహ్ లోని ఓ మసీదు, ఓ పాఠశాల పై దాడి చేసింది. ఈ రెండు ఘటనల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాము హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఐడీఎఫ్ పేర్కొంది.
Also Read: పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా! ఓటీటీలో సుహాస్ మూవీ