Gorre Puranam
Gorre Puranam: బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గొర్రె పురాణం. గ్రామంలోని ఒక గొర్రె వల్ల ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలవడం.. గ్రామస్థులు గొర్రె పై కేసు పెట్టడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపిందించారు. గత నెల సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: హరితేజ VS పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ నామినేషన్ గోల.. బుక్కైన అవినాష్..!
గొర్రె పురాణం ఓటీటీ రిలీజ్
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దసరా పండగ సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సుహాస్ తో పాటు విశిక కోట, రఘు కారుమంచి, కృష్ణ మురళి పోసాని తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.
పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా!
— ahavideoin (@ahavideoIN) October 7, 2024
అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా!!#GorrePuranam Premieres 10th Oct only on aha!@Directorbobby07, @ActorSuhas @pawanch19 @prashan86805501 @sureshsarangam pic.twitter.com/dXsNYi6mUQ
మూవీ కథ
గ్రామంలోని ఇరు వర్గాల మధ్య గొడవకు గొర్రె ఎలా కారణమైంది.? గ్రామస్థులు అంతా కలిసి గొర్రె పై కేసు పెట్టడం ఏంటి..? అనే అంశాలతో ఈ కథను రూపొందించారు. మరోవైపు సుహాస్ ఆ గొర్రెను కాపాడడం, దానిలో ఒక అమ్మాయి రూపాన్ని చూసుకోవడం చేస్తాడు. అసలు ఊరి ప్రజలు గొర్రె పై ఎందుకు కేసు పెడతారు? గొర్రెకు హీరోకు సంబంధం ఏంటి? గొర్రె రూపంలో సుహాస్ చూసుకుంటున్న అమ్మాయి ఎవరు? అనే అంశాలతో కథ సాగుతుంది.
Also Read: ఐటమ్ సాంగ్స్‌లో రెచ్చిపోతా.. ఈ హాట్ హీరోయిన్ మాటలు వింటే షాకే!