CM Revanth Reddy : భారతీయ పౌరుడిగా గర్వంగా ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  మరోవైపు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్‌ ఫోన్‌ చేశారు.  తక్షణమే బయల్దేరి హైదరాబాద్‌ రావాలని భట్టికి సీఎం సూచించారు.

New Update
cm-revanth-op-sindoor

cm-revanth-op-sindoor Photograph: (cm-revanth-op-sindoor)

ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  మరోవైపు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్‌ ఫోన్‌ చేశారు.  తక్షణమే బయల్దేరి హైదరాబాద్‌ రావాలని భట్టికి సీఎం సూచించారు.  ఆపరేషన్‌ సిందూర్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు.  సాయంత్రం జరిగే మాక్‌డ్రిల్‌ను సీఎం రేవంత్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాం ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ చేశారు.  పహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారని..  పాకిస్థాన్‌ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్‌ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ లో వెల్లడించారు.  

Advertisment
తాజా కథనాలు