Canada-India Row:
హోం మంత్రి అమిత్ షా పై కెనడా చేసిన ఆరోపణల మీద భారత ప్రభుత్వం మండిపడుతోంది. దీని మీద వెంటనే చర్యలు కూడా తీసుకుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారంటూ భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా కావాలని పదే పదే భారత్‌ను రెచ్చగొట్టే పని చేస్తోందని అంది. దీని మీద విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. కెనడా మంత్రి ఏ లక్ష్యాలతో అమిత్ షా మీద ఆరోపణలు చేశారని..కెనడియన్ హై కమిషన్ ప్రతినిధిని అడిగామని చెప్పారు. దాంతో పాటూ ఆ వ్యాఖ్యల మీద భారత ప్రుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఒక నోట్ను కూడా అందజేశామని తెలిపారు. కెనడా యూనియన్ హోం మంత్రి డేవిడ్ మారిసన్ చాలా అసంబద్ధమైన, నిరాధార ఆరోపణలు చేశారని రణధీర్ జైస్వాల్ అన్నారు.
Also Read: HYD: మెట్రో రెండోదశకు అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
Also Read: NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ
కెనడాలోని ఖలిస్థానీలపై చేసిన దాడుల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కెనడాలోని ఖలిస్తానీలపై చేసిన దాడులకు అమిత్ షా అనుమతి ఇచ్చినట్లు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ తెలిపారు. కెనడాలోని ఖలిస్థానీలపై చేసిన దాడుల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కెనడాలోని ఖలిస్తానీలపై చేసిన దాడులకు అమిత్ షా అనుమతి ఇచ్చినట్లు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం!