Anitha Anand: భగవద్గీతపై ప్రమాణం.. కెనడా మంత్రిగా అనితా ఆనంద్.. ఇంతకీ ఎవరీమె?

కెనడా విదేశాంగ మంత్రిగా భగవద్గీతపై చేయి వేసి అనితా ఆనంద్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన అనిత తండ్రి తమిళనాడుకి చెందగా తల్లి పంజాబ్‌కి చెందిన వారు. వృత్తి రీత్యా కెనడాలో స్థిర పడ్డారు. కార్పొరేట్ లాయర్‌గా అనిత కెరీర్‌ను ప్రారంభించారు.

New Update
ANitha Anand

ANitha Anand

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే వీరిలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ఈమె ట్రూడో ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మెలానీ జోలీ స్థానంలో అనితా ఆనందన్‌ను విదేశాంగ మంత్రిగా ప్రధాని మార్క్ కార్నీ నియమించారు. అయితే పార్లమెంట్‌లో అనితా భగవద్గీతపై చేయి పెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ అనితా ఆనంద్ ఎవరని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్‌ రెడ్డికి నో బెయిల్‌

ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

కెనడా మొదటి హిందూ మహిళ..

భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా మొదటి హిందూ మహిళా ఎంపీ, క్యాబినెట్ మంత్రి కూడా. ఈమె తండ్రి తమిళనాడుకి చెందిన వారు. తల్లి పంజాబ్‌కి చెందినది. వీరు భారతదేశానికి చెందిన వారు అయినా కెనడాలో స్థిర పడ్డారు. అనితా ఆనంద్ భర్త జాన్. అనితా ఆనంద్ పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ చదివి.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

ఆ తర్వాత న్యాయ విద్యలో మాస్టర్స్ చదివి.. కార్పొరేట్ లాయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు అనితా ఆనంద్ తన కెరీర్‌లో అనేక స్థానాల్లో పనిచేశారు. మొదటిసారి ఆమె 2019లో ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆయన 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీస్, ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా కూడా పనిచేశారు. ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా, జాతీయ రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.

ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు