/rtv/media/media_files/2025/12/20/bill-clinton-2025-12-20-18-17-55.jpg)
తన పరపతి పెంచుకోడానికి సంపన్నులు, వ్యాపారవేత్తలు, దేశాధినేతలు, యువరాజులకు అమ్మాయిల్ని ఎరగా వేసిన జెఫ్రీఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను కుదిపేస్తున్నాయి. ఇవి ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచం మొత్తం ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంగ్లాండ్ ప్రిన్స్ నే రాజసౌధం నుంచి గెంటేసేలా చేశాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు కొత్త ఎపిస్టీన్ ఫైల్స్ ను విడుదల చేశారు. దీంతో ఎప్‌స్టీన్ కేసులో ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలను విడుదలకు గడువు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంపై మరింత ఒత్తిడి పెరిగింది. కొత్తగా విడుదలైన ఫోటోలలో వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, గుర్తింపు పత్రాలు ఉన్నాయి. అయితే చాలా వరకు వీటిల్లో వ్యక్తిగత వివరాలను తొలగించారని తెలుస్తోంది.
బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ ఫోటోలు..
ఇక కొత్తగా విడుదల చేసిన ఎపిస్టీన్ పత్రాల్లో ప్రముఖ మేధావి నోమ్ చోమ్‌స్కీ , ఎప్‌స్టీన్‌తో విమానంలో కూర్చున్నట్లుగా రెండు ఫోటోలు ఉన్నాయి. అలాగే, బిల్ క్లింటన్ ఒక మహిళ పక్కన నిలబడి ఉన్న ఫోటో కూడా ఉంది. అలాగే పాప్ గాడ్ మైఖేల్ జాక్సన్ ఫోటోలు కూడా కనిపించాయి. వీరితో పాటూ అమ్మాయిలు, మహిళలు కూడా ఉన్నారు. కానీ వారి ముఖాలు బయటపడకుండా అస్పష్టంగా ఉంచారు. గతంలో విడుదలైన ఫోటోలలో కనిపించిన వూడీ అలెన్, ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బెన్నన్ఫోటోలు కూడా ఈ కొత్త బ్యాచ్‌లో ఉన్నాయి.
మరోవైపు ఈ కొత్త ఫోటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన పనులు చేసినట్లుగా కనిపించడం లేదు. అయితే, ఒక టెక్స్ట్ మెసేజ్ స్క్రీన్‌షాట్ ఉంది. అందులో ఎవరో తెలియని వ్యక్తి యువతులను రిక్రూట్ చేయడం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే ఎవరివీ వివరాలు ఇందులో మాత్రం కనిపించేలా చూపించలేదు. ఎందుకంటే గత నెలలో ఇరు పార్టీల మద్దతుతో ఆమోదించిన ఎపిస్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ ప్రకారం.. శుక్రవారం నాటికి న్యాయ శాఖ (DOJ) కీలక పత్రాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ చట్టం ప్రకారం.. బాధితుల గుర్తింపును కాపాడుతూ, అత్యంత సమగ్రమైన ఎప్‌స్టీన్ సంబంధిత పత్రాలను DOJ ప్రచురించాలి.
Follow Us