Joe Biden: పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షునిగా పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణులు డా.ఆంటోనీ ఫౌచి, అలాగే రిటైర్డ్ జనరల్ మార్క్‌ మిల్లే తదిరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు.

New Update
Joe Biden

Joe Biden

అమెరికా అధ్యక్షునిగా పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణులు డా.ఆంటోనీ ఫౌచి, అలాగే రిటైర్డ్ జనరల్ మార్క్‌ మిల్లే తదిరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీళ్లతో పాటు క్యాపిటల్ హిల్‌ దాడులపై విచారణ చేసిన హౌస్ కమిటీ సభ్యులకు సైతం ఉపశమనం కలిగించారు. ట్రంఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా.. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు బైడెన్ తెలిపారు. 

Also Read: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..

ఇదిలాఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ సోమవారం (భారతీయ టైమ్ ప్రకారం రాత్రి 10.30 PM) గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలు దేశాల నుంచి ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు తరలివచ్చారు. 2017 జనవరి 20న మొదటిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్.. ఇప్పుడు రెండోసారి అధికారం చేపట్టనున్నారు.ఇప్పటికే ట్రంప్ దంపతులు వైట్‌ హౌస్‌కు చేరుకున్నారు. జో బెడైన్ దంపతులు వారిని హౌస్‌ లోపలికి ఆహ్వానించారు. 

Also Read: ఆ దేశంలో స్థానికులను భయపెడుతున్న అగ్నిపర్వతం.. వెయ్యిసార్లు విస్పోటనం

Advertisment
తాజా కథనాలు