/rtv/media/media_files/2026/02/27/paradise-aaya-sher-2026-02-27-12-18-03.jpg)
Paradise Aaya Sher
Paradise Aaya Sher: న్యాచురల్ స్టార్ నాని Nani హీరోగా, కయ్యదు లోహర్ Kayadu Lohar హీరోయిన్ గా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'Srikanth Odela' రూపొందిస్తున్న భారీ చిత్రం ది పారడైజ్ The Paradise నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' Aaya Sher ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 24న, నాని బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాట రిలీజైన వెంటనే ఆకట్టుకుంది. పవర్‌ఫుల్ లిరిక్స్, ఎనర్జిటిక్ వోకల్స్, అనిరుద్ Anirudh Ravichander బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి. నాని స్టైలిష్ హుక్ స్టెప్, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు మాస్ అట్రాక్షన్ ఇచ్చాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక్క పాటతో సినిమాపై అంచనాలను పెంచేశాడు.
ఆయా షేర్ 24 గంటల రికార్డ్స్.. (Paradise Aaya Sher Youtube Views)
- 21.75 మిలియన్ వ్యూస్
- 7 లక్షల లైక్స్
- యూట్యూబ్ మ్యూజిక్‌లో #1 ట్రెండింగ్
'ఆయా షేర్' ఫుల్ లిరిక్స్ ఇదిగో!
పల్లవి:
హే నీ అయ్యా జగిరా..
చల్ మావాడోచింద్రా..
ఇగ జడ్తియ్యాలే | జుంబలికే ఆయా షేర్ |
హే ఆ దార్ కా సుల్తానే..
మా ఘర్ కా సైతానే..
చల్ షికార్ జెయ్యా | జుంబలికే ఆయా షేర్ |
పచ్చ బొట్టు గాయమిది | ఆయా షేర్ |
గుంజుకునే న్యాయమిది | ఆయా షేర్ |
బూదిధల గడ్డ ఇది | ఆయా షేర్ |
మాతో రాయబడ్డ కదే ఇది | ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో..
కొడుతరో తొడలురో తీస్తరో తొలురో..
సవారికి దొరుకు బిడ్డా..
సేవాలే లేస్తాయి బిడ్డా..
పెగుల్ దీసి మెడల యేసి..
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా..
చరణం:
ఆడ ఈడ యేడ జూడు బిడ్డా..
వనుకయ్ పుట్టలింక పడితేనయ్ నా నీడ..
బొంద పెడతా మలిక్నైన గూడ..
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ..
చల్ ఉడుకుతుంది సరా బట్టిలో మా కంట తడే.. | జుంబలికే ఆయా ఆయా షేర్ |
ఇగ రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే.. | జుంబలికే ఆయా ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో..
కొడుతరో తొడలురో తీస్తరో తొలురో..
సవారికి దొరుకు బిడ్డా..
సేవాలే లేస్తాయి బిడ్డా..
పెగుల్ దీసి మెడల యేసి..
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా..
హే బరి బత్తలునొన్నిన్రా..
బర్ బాదే అయినొన్రా..
నన్ను పీకుతవా | జుంబలికే ఆయా షేర్ |
హే మొల్ధారం లేనొనిరా..
నీకన్నా మొండొన్రా..
ఇగ పీకుతవా | జుంబలికే ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది | ఆయా షేర్ |
మెట్టు మెట్టు ఎక్కుతరా | ఆయా షేర్ |
పేరు పతా లేనొన్ని రా | ఆయా షేర్ |
చూస్కో పారడైస్ కు అడ్రెసైతా | ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది..
మెట్టు మెట్టు ఎక్కుతరా..
పేరు పతా లేనొన్ని రా..
చూస్కో పారడైస్ కు అడ్రెసైతా..
ఇది tier-2 సినిమా ఫార్మాట్ కు రికార్డు రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి యూట్యూబ్ మ్యూజిక్‌లో ట్రెండింగ్ #1 స్థానంలో ఉంది. ఈ స్పీడ్ చూస్తే వచ్చే వారాల్లో 100 మిలియన్ వ్యూస్ దాటే అవకాశముంది.
ప్రేక్షకులు పాట వినగానే హుక్ అవుతుందని, మాస్ బీట్, విజువల్స్, నాని స్క్రీన్ ప్రెజెన్స్ కలిపి ప్రత్యేక ఆకర్షణగా ఉందని అభిప్రాయపడ్డారు. నాని డాన్స్ స్టెప్స్ అభిమానులను మెప్పించాయి. అయితే, కొందరు నెటిజన్లు మలయాళం స్టైల్ అని ట్రోల్ చేయడం, డాన్స్ స్టెప్స్‌పై విమర్శలు కూడా చేశారు. మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమేనని, పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్నారు.
ఫస్ట్ సింగిల్ మంచి హిట్ కావడం వల్ల మొత్తం ఆల్బమ్ పై అంచనాలు పెరిగాయి. తదుపరి పాటలు కూడా ఇదే ఉత్సాహం చూపిస్తే, 'ది పారడైజ్' ఆడియో ఈ సంవత్సరంలో హైలైట్‌గా మారే అవకాశం ఉంది.
రాబోయే అప్డేట్స్, మరిన్ని పాటలు, తదుపరి ప్రమోషన్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. అభిమానులు ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
Follow Us