ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై అల్లరు చెలరేగడంతో అప్పటి ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి
హసీనాపై 60 ఫిర్యాదులు
ప్రస్తుతం మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలతో ఆమెకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై ట్రైబ్యునల్ కూడా ఇటీవలే దర్యాప్తు చేసింది. భారత్‌లో ఉంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని.. ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ ఇటీవలే చెప్పారు. ఆమెను ఎలాగైనా బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ క్రమంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు
పాస్‌పోర్టు రద్దు
హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా ఇప్పటికే రద్దయిపోయింది. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పార్టు రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఆగస్టు 5న ప్రధాని పదవి నుంచి దిగిపోయాక భారత్‌కు వచ్చిన షేక్ హసీనా ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!
మరోవైపు హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రస్తుతం అక్కడ ఉన్న యూనస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలోనే చెప్పింది. హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలా ? వద్దా ? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొంది. అయితే తాజాగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేయడంతో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!