Chinmoy Krishna Das: బెయిల్‌ నిరాకరించిన బంగ్లా కోర్టు!

దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాలో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ ఊరట లభించలేదు. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను చటోగ్రామ్‌ లోని కోర్టు తిరస్కరించింది.బెయిల్‌ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.

New Update
chhinmoy

chinmoy

Bangladesh: దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాలో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ ఉ ఊరట లభించలేదు. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను చటోగ్రామ్‌ లోని కోర్టు తిరస్కరించింది.బెయిల్‌ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.

Also Read: AP Crime News: ఏపీలో దారుణం.. నడి రోడ్డు పై భర్తను చంపేసిన భార్య!

బంగ్లాలోని చటోగ్రామ్ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు జరిగాయి. చిన్మయ్‌ అరెస్ట్‌ అనంతర పరిణామాలను దృష్టిలోపెట్టుకుని గురువారం న్యాయస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

Also Read: Sunita Williams: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్

బంగ్లాలో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గతేడాది నవంబర్‌ లో చిట్టగాంగ్‌ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబర్‌ 25న పోలీసులు ఆయనను అరెస్ట్‌చేశారు.

Also Read: Sabarimala: ఐదురెట్లు అధిక రద్దీ.. వారికి ప్రత్యేక పాస్‌లు రద్దు

అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరుఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా..అతడిపై ఆందోళనకారులు దాడిచేశారు. మరో సీనియర్‌ న్యాయవాది కేసును టేకప్‌ చేయగా..ఆయన పైనా బెదిరింపులకు పాల్పడ్డారు.

Also Read: Kakinada: ఏపీలో తెగబడ్డ గంజాయి బ్యాచ్.. ఏకంగా పోలీసులపైకే !

దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు చిన్మయ్‌ భాగస్వామి ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్‌, జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు