పాకిస్తాన్‌కు BLA మరో బిగ్ షాక్..  భారీగా ప్రాణ నష్టం.. ఆ నగరం ఔట్!

భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్థాన్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) శనివారం అధికారికంగా ప్రకటించింది

New Update
Balochistan

Balochistan

భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్థాన్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) శనివారం అధికారికంగా ప్రకటించింది. 39 చోట్ల మెరుపుదాడులు చేపట్టినట్లుగా ఆ గ్రూప్ ప్రతినిధి జీయంద్ బలూచ్ మే 10న ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు.   ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్‌లైన్లు, ప్రధాన రహదారులు లక్ష్యంగా మారినట్లు సమాచారం.  దీంతో ఖజినాయ్ హైవేను మూసివేసి, స్థానిక పోలీసులను తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని.. కొన్ని గంటల తరువాత వారిని విడుదల చేశారు. బీఎల్‌ఏ దాడుల్లో పాకిస్థాన్ సైనికులకు భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

వేరే దేశం కావాలని

కాగా గత రెండు రోజులుగా పాక్‌ సైన్యంపై బలోచ్‌ రెబల్స్‌ దాడులు చేస్తున్న  సంగతి తెలిసిందే.  తమను పాక్‌లో భాగంగా కాకుండా వేరే దేశం కావాలని బలూచిస్థానీలు డిమాండ్ చేస్తున్నారు.  పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నప్పటికీ డెవలప్ మెంట్ లో మాత్రం బలూచిస్థాన్ వెనకబడి ఉంది. బలూచిస్థాన్ నుంచి ఆయిల్, గ్యాస్, ఖనిజాలు వంటి సంపదలు వెలువడుతున్నప్పటికీ దాని లాభాన్ని స్థానిక ప్రజలకు రాకుండా పాక్ సైనిక ప్రభుత్వ వ్యవస్థ కబ్జా చేసిందనేది బలూచిస్థాన్ ప్రజల ఆరోపిస్తున్నారు. వేర్పాటు వాద భావాలను అణచివేసేందుకు పాక్ సైన్యం ఐఎస్‌ఐ వంటి సంస్థల ద్వారా బీఎల్‌ఏపైన తీవ్ర హింసకు పాల్పడుతోంది. వేలాది మంది యువకులు గల్లంతైన పరిస్థితి నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు