స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ వరదల ప్రభావానికి దాదాపు 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు. ఇంకా వాళ్ల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ప్రవాహంలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Also Read: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్
ఇక దక్షిణ స్పెయిన్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. వరదల వల్ల తప్పిపోయిన వారి ఆచూకీ కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. అలాగే అధికారుల సలహాలను కూడా పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఈ ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్!
ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా, జపాన్ దేశాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెయిన్‌లో కూడా వరదలు అక్కడి ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. మరోవైపు ప్రపంచంలో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.