ఉగ్రవాదం చట్టబద్ధమైన పోరాటమే.. పాక్ ఆర్మీ ఛీఫ్ సంచలనం!

కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్‌ అసిమ్ మునీర్ అన్నాడు. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు.

New Update
asim-munir-305420271-16x9_0

Pakistan: కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేస్తోంది చట్టబద్ధమైన పోరాటం అని పాక్ ఆర్మీ ఛీఫ్‌ అసిమ్ మునీర్ అన్నాడు. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పాడు. అంతేకాదు భవిష్యత్తులో తమపై ఏదైనా దాడి జరిగితే తగిన ప్రతిస్పందన ఉంటుందని భారతదేశాన్ని హెచ్చరించారు. 

హక్కు కోసం పోరాటం..

ఈ మేరకు కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ వేడుకలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. భారతదేశం ఉగ్రవాదులుగా ముద్ర వేసినావారు, అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించబడినవారు, స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నారన్నాడు. కశ్మీరీ ప్రజల ఇష్టాన్ని అణచివేసి, పరిష్కారానికి బదులుగా సంఘర్షణను సృష్టించి, తమ సొంత చర్యల ద్వారా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించారని ఇండియాను విమర్శించాడు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం కశ్మీర్ ప్రజలు చేసే పోరాటంలో పాకిస్తాన్ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అన్నాడు. 'ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, న్యాయమైన పరిష్కారం కోసం వారికి పాకిస్తాన్ ఎల్లప్పుడు బలమైన న్యాయవాది' అని పేర్కొన్నారు. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

 జమ్మూ & కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటాయని భారతదేశం పాకిస్తాన్‌కు పదేపదే చెప్పిందన్నాడు. భారతదేశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ, కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ద్వారా 2019  ఆగస్టు 5న రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయని గుర్తు చేశాడు. ఇక భారత సైనిక దాడిని రెండుసార్లు తిప్పికొట్టిన తర్వాత పాకిస్తాన్ తనను తాను మరింత బలమైనదిగా నిరూపించుకుందని మునీర్ పేర్కొన్నాడు. భారత్ నుంచి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ, పాక్ సంయమనం, పరిణతితో వ్యవహరించింది. శాంతి, నిబద్ధతను ప్రదర్శించిందన్నాడు. శత్రువుల ప్రయత్నాలకు భయపడకుండా పాకిస్తాన్ పురోగతి, అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ అన్నాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు