ICICI Bank: దుమ్మెత్తి పోసిన ఖాతాదారులు.. వెనక్కు తగ్గిన ICICI బ్యాంక్!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది.

New Update
ICICI Bank Minimum Balance

ICICI

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ను పెంచాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఎందుకంటే కనీస బ్యాలెన్స్‌ను (Balance) పెంచుతున్నట్లు ప్రకటించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి ఇంత ఎక్కువగా కనీస బ్యాలెన్స్ ఉండటం ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ (ICICI) తగ్గింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఖాతాదారులు తప్పకుండా రూ.15000 నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7500 ఉండాలని ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది. అదే గ్రామీణ ఖాతాదారులకు అయితే మాత్రం రూ.2500 సగటు బ్యాలెన్స్ ఉండాలని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Income Tax Bill 2025: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !

కనీస బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలని..

సేవింగ్స్ అకౌంట్‌లో (Savings Accounts) మినిమమ్ బ్యాలెన్స్ తప్పకుండా రూ.50 వేలు ఉండాలని ఐసీఐసీఐ ఇటీవల వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ తర్వాత ఎవరైతే అకౌంట్ (Account) తెరుస్తారో వారికి ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. అయిత మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లు తప్పకుండా మినిమమ్ బ్యాలెన్స్‌ను రూ.50 వేలకు పెంచేసింది. గతంలో ఇది రూ.10 వేలుగా ఉండగా రూ.50 వేలకు పెంచారు. సెమీ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తం రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. ఇక గ్రామీణ ఖాతాదార్లకు రూ.2500 నుంచి రూ.10 వేలకు పెంచింది. దీనిపై ప్రజలు నుంచి విమర్శలు వచ్చాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది స్పందించారు. అయితే దీనిపై ఆర్బీఐ (RBI కూడా స్పందించలేదు. తీవ్రంగా విమర్శలు రావడంతో ఐసీఐసీఐ సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ సేవింగ్స్ (Savings Account) అకౌంట్స్‌ విషయంలో పాటించాలని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Retail inflation drop: సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన ధరలు!

Advertisment
తాజా కథనాలు