Oracle Lay offs: ఏఐ ఎఫెక్ట్‌కి బలి అవుతున్న ఉద్యోగులు.. ఒరాకిల్‌లో భారీగా కోత!

ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్‌లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్‌లో తెలిపింది.

New Update
Oracle Lay offs

Oracle Lay offs

ఏఐ వచ్చినప్పటి నుంచి ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగిస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు భారీగా లే ఆఫ్‌లు విధించింది. ఇప్పుడు తాజాగా ఒరాకిల్ కూడా లే ఆఫ్‌లు చేపట్టింది. ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్‌లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ కంపెనీలో డేటా సెంటర్ల ఆపరేషన్స్ టెక్నీషియన్స్, క్లౌడ్ బృందాలు, ఏఐ, ఎంఎల్ బృందాల టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్లపై లే ఆఫ్‌లు విధించారు. 

ఇది కూడా చూడండి: Retail inflation drop: సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారత్‌లో భారీగా తగ్గిన ధరలు!

ఏఐ కారణం వల్లే ఉద్యోగాలు కోత

ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎక్కువగా ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ 15 వేల మంది ఉద్యోగులను ఇటీవల తొలగించింది. ఈ కంపెనీ ఈ ఏడాదిలో మొత్తం నాలుగు విడతల్లో ఉద్యోగులను తొలగించింది.  

ఇది కూడా చూడండి:ICICI Bank: దుమ్మెత్తి పోసిన ఖాతాదారులు.. వెనక్కు తగ్గిన ICICI బ్యాంక్!

ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సుమారుగా 15 వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది. ఈ ఏడాది జూలైలో లేఆఫ్స్ విధించింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియాలు కలిసి జియోస్టార్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ విభాగాల్లో ఉన్నవారిపై కంపెనీ వేటు వేసింది. ఎంట్రీ లెవల్ ఉద్యోగులతో పాటు సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులపై కూడా వేటు వేసినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు