Israeli attack on Doha: అరబ్ దేశాలన్నీ సీరియస్.. ఇజ్రాయిల్‌కు మూడిందా?

ఖతార్‌ రాజధాని దోహలో ఇజ్రాయెల్‌ దాడిని అరబ్‌ దేశాలు సీరియస్‌ తీసుకున్నాయి. మంగళవారం దోహలో ఉన్న హమాస్‌ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌పై సీరియస్‌ యాక్షన్‌కు సిద్ధమవుతున్నాయి.

New Update
Israeli attack on Doha

ఖతార్‌ రాజధాని దోహలో ఇజ్రాయెల్‌ దాడిని అరబ్‌ దేశాలు సీరియస్‌ తీసుకున్నాయి. మంగళవారం దోహలో ఉన్న హమాస్‌ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్‌ హయ్యా.. అతని కుమారుడితో పాటు ఆరుగురు మృతి చెందారు. అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌పై సీరియస్‌ యాక్షన్‌కు సిద్ధమవుతున్నాయి. UAE ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్‌ వెంటనే ఖతార్‌కు వెళ్లారు. జోర్డాన్ యువరాజు హుస్సెన్ కూడా ఖతార్‌ సందర్శనకు సిద్ధమయ్యారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్‌ సల్మాన్‌ రేపు ఖతార్‌కు వెళ్లనున్నారు. 

ఆర్థిక ఆంక్షలు సహా దౌత్య సంబంధాలు తెంచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అవసరమైతే ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగే అవకాశం కూడా ఉంది.

Advertisment
తాజా కథనాలు