హమాస్ అవుట్ అంటూ.. గాజాలో వ్యతిరేకంగా నిరసనలు

హమాస్‌కు వ్యతిరేకంగా ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ప్రజలు నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేస్తూ.. తక్షణమే యుద్ధం ముగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

author-image
By Kusuma
New Update
Hamas war

Hamas war Photograph: (Hamas war)

హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల గాజాలో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేస్తుూ.. తక్షణమే యుద్ధం ముగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

హమాస్ అధికారం నుంచి కూడా వైదొలగాలని వందలాది మంది పాలస్తీనియన్లు రోడ్లుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. యుద్ధాన్ని ఆపండి.. ప్రశాంతంగా ఎలాంటి రక్తపాతం లేకుండా జీవించాలని అనుకుంటున్నామని నినాదాలు చేస్తున్నారు. హమాస్ అవుట్, స్టాప్ దా వార్ అంటూ బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

ముందు నుంచే హమాస్‌పై వ్యతిరేకత..

ఇదిలా ఉండగా హమాస్ గాజాను 2007 నుంచి పాలిస్తుంది. అయితే ఇజ్రాయెల్‌తో యుద్ధం సమయంలో ఎందరో వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి హమాస్‌పై గాజాలో వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవల కాల్పుల విరమణకు హమాస్ నిరాకరించింది. దీంతో టెల్‌అవీవ్‌ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పాలస్తీనావాసులు మిలిటెంట్‌ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్‌ ఎందుకు తన అధికారాన్ని వదులుకోదని నిరసనలు చేపట్టారు. అయితే టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే నిరసనలు చేపట్టినట్లు అందులో కొందరు వెల్లడించారు. అయితే దీనిపై మిలిటెంట్‌ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisment
తాజా కథనాలు