/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t074139258-2025-12-04-07-42-19.jpg)
Another Indian lucky winner wins Rs. 61 crore jackpot in lottery
Jackpot : విదేశాల్లో నిర్వహిస్తున్న పలు లాటరీలు భారతీయుల పంట పండిస్తున్నాయి. గత కొంతకాలంగా భారతీయులు వరుసగా లాటరీల్లో కోట్లు గెలుచుకుంటున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో ఉంటున్న భారతీయుడికి భారీ జాక్‌పాట్ తగిలింది. అబుధాబి వేదికగా నిర్వహించే లాటరీ ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’ని డిసెంబర్ 3న లక్కీ డ్రా తీయగా కేరళకు చెందిన పీవీ రాజన్ రూ.61.37 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకోవడం విశేషం. రాజన్ నవంబర్ 9న టికెట్ (282824) కొనుగోలు చేయగా దానికి లక్కీ డ్రా తగిలింది.
అయితే రాజన్ గడచిన15 ఏళ్లుగా క్రమం తప్పకుండా ‘బిగ్ టికెట్’ లాటరీ కొంటున్నాడు. అయినా ఆయనకు ఇంతవరకు కలిచిరాలేదు. కానీ, ఈరోజు ఆయనను అదృష్టం వరించింది. ఏకంగా రూ.61.37 కోట్లు గెలుచుకున్నాడు. కాగా లాటరీ నిర్వాహకులు రిచార్డ్, బౌచ్రా సమక్షంలో గత సిరీస్ విజేత అయిన మరో భారతీయుడు శరవణన్ వెంకటాచలం లక్కీ డ్రా తీశారు. ఇందులో రాజన్ కొన్న టికెట్‌కు బంపర్ ఆఫర్ తగలడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ తగిలిన విషయాన్ని ఫోన్లో నిర్వాహకులు చెప్పగా, రాజన్ ఆనందంతో ఒక్క క్షణం ఏం మాట్లాడలేకపోయాడు. అనంతరం తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. లాటరీ తగలడం చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. తాను లైవ్ షో చూడలేదని, ఆ సమయంలో బయట ఉన్నట్లు వివరించాడు. కాగా, తను గెలుచుకున్న డబ్బును తన 15 మంది సహచరులతో పంచుకుంటానని వెల్లడించడం విశేషం. రాజన్ సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నారు.
సౌదీలో ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి’ ప్రతినెల లక్కీడ్రా నిర్వహిస్తుంటుంది. ప్రతినెలా గ్రాండ్ ప్రైజ్‌తో పాటు పలు కన్సోలేషన్ బహుమతులను కూడా అందిస్తుంది. ఈసారి 10 మందికి కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. ఆ విజేతలు ఒక్కొక్కరు రూ.2.45 లక్షలు(10వేల దిర్హాములు) చొప్పున అందుకున్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉండటం గమనార్హం. గత నెల 3న తీసిన బిగ్ టికెట్ లక్కీడ్రాలో తమిళనాడుకు చెందిన శరవణన్ వెంకటాచలం విజేతగా నిలిచి విషయం తెలిసిందే. దీంతో ఆయన 25 మిలియన్ల దిర్హాములు అందుకున్నారు. బిగ్ టికెట్ లాటరీని భారతీయులు వరుసగా రెండోసారి గెలవడం గొప్ప విశేషం.
Follow Us