Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం...

మయన్మార్‌లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

Again Earthquake in Myanmar : మయన్మార్‌లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది గాయపడగా… 500 మంది ఆచూకీ గల్లంతైంది. అయితే, ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే మరోసారి భూకంపం సంభవించింది. దీంతో మరోసారి భారీ శబ్దాలతో ఆ దేశం ఉలిక్కిపడింది. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. భూకంప ధాటికి మయన్మార్ శ్మశానవాటికను తలపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!

దేశంలో ఎక్కడ చూసిన కూలిపోయిన భవనాలు, ధ్వంసమైన రోడ్లు, సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డ ప్రజలే దర్శనమిస్తున్నారు. భవన శిథిలాల కింద ఇంకా అధికారులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ విషాదం నుంచి మయన్మార్ ప్రజలు ఇంకా తేరుకోకముందే.. తాజాగా ఆ దేశంలో మరోసారి భూకంపం వచ్చింది. బుధవారం (ఏప్రిల్ 2) రిక్టర్ స్కేల్‎పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని వెల్లడించింది. 

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

ఈ భూకంపం ధాటికి ప్రస్తుతానికైతే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో మయన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ భయంతో బతుకున్నారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం ధాటి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో హెల్మెట్ ధరించడం చికాకుగా ఉంటుందా..ఇలా చేయండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు