సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ఎందుకంటే ? అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది.అమెరికాతో పాటు మిత్రదేశాలపై ఐసిస్ ఉగ్రదాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోందని అమెరికా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ముందస్తుగా దాడులు చేస్తోంది. By B Aravind 12 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్కడ ఉన్న ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. శుక్రవారం ఇప్పటివరకు దశల వారీగా దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ కీలక ప్రకటన చేసింది. అలాగే అమెరికాతో పాటు మిత్రదేశాలపై ఐసిస్ ఉగ్రదాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోందని అమెరికా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ముందస్తుగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో సిరియాలో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. Also Read: అంబానీ బంపర్ ఆఫర్..జియో ఫైనాన్స్ యాప్ లో లోన్స్ ఈ మధ్యకాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబర్ చివరిలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని ప్రకటన చేసింది. వాళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినట్లుగా పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే తాజాగా చేసిన దాడుల వల్ల ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని అమెరికా తెలిపింది. తమ ప్రయోజనాలకు విఘాం కలిగించేలా.. మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవాళ్లని సహించబోమని తేల్చి చెప్పింది. గతంలో సిరియాలో ఐసీస్ పెద్దఎత్తున భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో మళ్లీ ఐసిస్ దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ప్రస్తుతం దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని సిరియాలో మోహరించింది. #telugu-news #usa #america #syria మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి