BREAKING : అహ్మదాబాద్ ఘటన మరవక ముందే.. మరో విమానంలో మంటలు!

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు ఇంజన్‌లో పొగలు వచ్చాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడంతోొ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

New Update
American Airlines

American Airlines

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్ లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్‌లో పొగలు వచ్చాయి.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

గాల్లో విమానం ఉన్నప్పుడే..

విమానం గాల్లో ఉండగానే ముందుగా పెద్ద శబ్ధం వచ్చి ఆ తర్వాత దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో పైలెట్‌లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్‌పోర్టుకు తిరిగి తెచ్చేశారు. అదృష్టవశాత్తు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ఉన్నవారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్‌ మేనేజర్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు