భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ?

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెప్పింది.

Flight ind
New Update

అమెరికాలో అక్రమ వలసదారులు పెరగడం గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారింది. వీళ్లని నియంత్రించాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (DHS) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెప్పింది.   

Also Read: మెక్‌డొనాల్డ్స్‌ ఇ.కోలి బ్యాక్టీరియా..13 రాష్ట్రాల్లో 75 మంది!

బందీలు కాకుండా ఉండేందుకే

చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్నటువంటి భారత పౌరులను వెనక్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నామని డీహెచ్‌ఎస్‌ సీనియర్ అధికారి క్రిస్టీ ఎ. కనెగాల్లో తెలిపారు. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు అవుతున్నారని.. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత నెల జూన్‌లో ది బోర్డర్ ప్రెసిడెన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గాయని డీహెచ్‌ఎస్‌ గుర్తించింది. 

Also Read: ఇజ్రాయెల్‌ ప్యాంట్‌ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!

చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహిస్తాం

ఈ క్రమంలోనే 2024 ఆర్థిక ఏడాదిలో దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపామని పేర్కొంది. మొత్తం 145 దేశాలకు చెందిన వలసదారులను 495కు పైగా ప్రత్యేక విమానాల్లో పంపించినట్లు పేర్కొంది. వీళ్లతో భారత్‌తో పాటు కొలంబియా, ఈక్వెడార్, ఈజిప్ట్, పెరు, ఈజిప్ట్, సెనెగల్, మారిటానియా, ఉజ్బెకిస్థాన్, చైనా దేశాల పౌరులు ఉన్నారు. ఈ చర్యలు సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను కంట్రోల్ చేయడం అలాగే చట్టబద్ధమైన వలసల మార్గాలు ప్రోత్సహించేందుకే అని అమెరికా స్పష్టం చేసింది.  

#telugu-news #immigration #usa #america #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe