Donald Trump: ట్రంప్ నిర్ణయంపై నటి కన్నీళ్లు.. వీడియో వైరల్!

అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమికొడతాననే ట్రంప్ ప్రకటనపై హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు ఏదైనా మార్గం చూపాలని ఉంది. ఏదో ఒకటి చేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వీడియో వైరల్ కాగా జనాలు ట్రోల్ చేశారు. పోస్ట్ డిలీట్ చేసింది. 

New Update
selena gomez tr

Selena Gomez gets emotional over Trump immigration decision

Donald Trump:  వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం తనను చాలా బాధపెట్టిందంటూ హాలీవుడ్ స్టార్ నటి ఆవేదన వ్యక్తం చేసింది. అక్రమ వలసదారులపై చట్టం చేస్తామంటున్న ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలకు మద్దతుగా దీనిపై ఆమె విమర్శలు గుప్పిస్తూ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తీవ్రంగా ఏడుస్తూ కనిపించడం జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొంతమంది ట్రోల్ చేయగా ఆమె వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. 

నేను చాలా విచారంగా ఉన్నాను..

అమెరికాలో అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొడతానని ట్రంప్ ప్రకటించారు. అప్పటి నుంచి దీనిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ప్రవాసులు భారతీయులే. అమెరికన్స్ కూడా చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే 32 ఏళ్ల హాలీవుడ్ నటి, గాయని సెలీనా గోమెజ్ ఇది తన ప్రజలపై దాడిగా పేర్కొంది. తన ప్రజలకు ఏదైనా మార్గం చూపాలని ఉందని, తన తరఫున ఏదైనా చేస్తానంటూ హామీ ఇచ్చింది. అయితే ఇదంతా ఏడుస్తూనే చెప్పింది. 'నేను చాలా విచారంగా ఉన్నాను. ఏదైనా చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కానీ ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాని వాగ్దానం చేస్తున్నా. ఐ యామ్ సారీ' అంటూ  క్యాప్షన్‌లో రాసి పోస్టుకు మెక్సికన్ ఫ్లాగ్ ఎమోజీని జతచేసింది. 

సెలీనా గోమెజ్ తొలగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సెలీనా.. 'నన్ను క్షమించండి అని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. నా ప్రజలు దాడికి గురవుతున్నారు. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు' అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసి సెలీనా ఆ వీడియోను డిలీజ్ చేసింది. సెలీనా అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించింది. ఆమె వలస పౌరుల గురించి, ముఖ్యంగా మెక్సికన్ పౌరుల గురించి చాలా కాలం తన వాయిస్ వినిపిస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు