అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తలపడుతున్నారు. ఇప్పటికే 6.8 కోట్ల మంది ముందే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!
ఎన్నికలకు ముందే ట్రంప్ హవా..
ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్‌లో ముందుంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 48 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. అంటే కమలాహారిస్ కంటే 1.8 శాతం ఎక్కువగానే డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ అయిన ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్ హవానే కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..
మరికొన్ని సర్వేలు ట్రంప్ కంటే కమలాహారిస్ ముందుంజలో ఉన్నాయని చెబుతున్నాయి. నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, ఆరిజోనాలో కమలాహారిస్‌కి 47 మంది మద్దతు ఇస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్‌కి కేవలం 44 శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి ప్రెసిడెంట్ అవుతారో చూడాలి.
ఇది కూడా చూడండి: USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. వీరు ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులకు ఓట్లు వేస్తారు. వారు అధ్యక్షుడుని ఎన్నుకుంటారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉంటాయి. ఇందులో 270 సీట్లు ఎవరికి వస్తాయో వారే అధ్యక్షులు అవుతారు. అయితే ఈ ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు లిబర్టేరియన్ పార్టీ నుంచి ఛేస్ ఒలివర్, గ్రీన్‌పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌లో ఉండే అంశాలేంటి?