BREAKING: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 1800 పైగా విమానాలు..?

అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో సాంకేతిక సమస్యలు రావడంతో  డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1800 పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.

New Update
America

America

అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో సాంకేతిక సమస్యలు రావడంతో  డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1800 పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ సాంకేతిక సమస్య వల్ల డల్లాస్ ఎయిర్‌పోర్టులో 20 శాతం విమానాలు రద్దు అయినట్లు తెలిపారు. అలాగే అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన 200కు పైగా విమానాలు రద్దవగా, 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. దాని కోసం రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే

మొత్తం 1,100లకు పైగా విమానాలు..

విమాన ట్రాకింగ్ చేసే ఫ్లైట్‌అవేర్ అనే సంస్థ ప్రకారం, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చెందిన 1,100కు పైగా విమానాలు చాలా ఆలస్యంగా నడవనున్నాయి. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు ఈ ఏడాది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు కొత్త కాదు.. ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గత వారం కూడా డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కూడా ఇలాంటి ఓ సమస్య తలెత్తింది. దీంతో అప్పుడు కూడా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు కూడా విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Shyam Pitroda: పాకిస్తాన్ నా సొంతఇల్లులా అనిపిస్తోందన్న కాంగ్రెస్ నేత

Advertisment
తాజా కథనాలు