అమెరికాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హెలెన్ తుపాను మరవక ముందే మరో తుపాను అమెరికా ప్రజలను భయపెట్టిస్తోంది. హరికెన్ మిల్టన్ తుపాను ప్రభావంతో ఫ్లోరిడా వణుకుతోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ఫ్లోరిడా వైపు మిల్టన్ వెళ్తుంది. గంటలకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సంగా వీస్తున్నాయి. టంపా బే తీరాన్ని వాతావరణ శాఖ అలర్ట్ చేశారు. కేటగిరి-5 హరికెన్‌గా వాతావరణ శాఖ గుర్తించింది.
ఇది కూడా చూడండి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్
హెలెన్ తుపాను మరవక ముందే..
ఈ మిల్టన్ తుపాను ప్రభావం వల్ల ఆకస్మికంగా వరదలు వస్తాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హరికెన్ హెలెన్ సృష్టించిన విధ్వంసం మరవక ముందే మరో విధ్వంసం రాబోతుంది. ఫ్లోరిడాతో పాటు మొత్తం ఆరు రాష్ట్రాల్లో హెలెన్ విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను కారణంగా 400 మందికిపైగా మృతి చెందారు.
ఇది కూడా చూడండి: ఎల్బీ స్టేడియంలో నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
హరికెన్ మిల్టన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలను సూచించారు. గాలులు ఎక్కువగా వస్తునాయి.. వందేళ్ల కాలంలో అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకర తుపానులలో ఇదీ ఒకటి కావొచ్చు. అందరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని అధ్యక్షుడు దేశ ప్రజలను సూచించారు.
ఇది కూడా చూడండి: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన..50మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా