జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన..50మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోలకతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సీనియర్ వైద్యులు మద్దతిస్తూ.. 50 మంది రాజీనామా చేశారు.

New Update
Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సీనియర్ వైద్యులు కూడా మద్దతు ప్రకటించారు. అయితే ఈ ఘటనలో తాజాగా 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది కలిసి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా అందరూ కలిసి రాజీనామా చేశారు. 

ఇది కూడా చూడండి: BREAKING: మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

బాధితురాలికి న్యాయం జరగాలని..

ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై ఆగస్టు 9న హత్యాచార ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు.

ఇది కూడా చూడండి: వాహనదారులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. అవన్నీ ఇక స్క్రాప్‌కే!

మహిళల భద్రత విషయంలో ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. అయితే తమ డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించి గత నెల 21న విధుల్లో చేరారు. కానీ మహిళల భద్రతకు సంబంధించి సానుకూల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేవని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా సీనియర్ వైద్యులందరూ రాజీనామా చేశారు. 

ఇది కూడా చూడండి: నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు