ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది గురూ. ఇప్పటి వరకు ఒక మనిషి దొంగతనం చేయడం చూశాం. కానీ ఒక యంత్రం దొంగతనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపై మనిషి దొంగతనం చేయడం ఇక తగ్గిపోనుంది. యంత్రాలే దొంగతనం చేయబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.
Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
12 రోబోలు కిడ్నాప్
ప్రస్తుత ఆధునిక యుగంలో మానవుడు భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని కనుగొన్నాడు. అయితే ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఓ యంత్రం దాదాపు 12 రోబోలను కిడ్నాప్ చేయడం అందరినీ కలవరపరుస్తుంది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్
ఆ వీడియో ప్రకారం.. చైనాలోని హాంగ్‌ఝౌ అనే రోబోల తయారీ సంస్థకు చెందిన ఎర్త్‌బై అనే చిన్న రోబోకు ఏఐ సామర్థ్యం ఉంది. దీంతో ఆ చిట్టి రోబో షాంఘై రోబోటిక్స్ కంపెనీ షోరూమ్‌లోకి వెళ్లింది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద రోబోట్‌లతో మాట్లాడింది. ఏం చెప్పిందో ఏమో గాని.. అక్కడున్న ఒక పెద్ద రోబో తనకు విశ్రాంతి లేదని చెప్పింది. అంతేకాకుండా తాను అనుమతి లేకుండా బయటకు వెళ్లనని తెలిపింది.
Also Read : అదానీకి మరో బిగ్ షాక్.. షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
దానికి చిట్టి రోబో స్పందిస్తూ అయితే నువ్వు ఇంటికెళ్లవా? అని అడిగింది. దాంతో పెద్ద రోబో మాట్లాడుతూ.. తనకు ఇళ్లు లేదని సమాధానం ఇచ్చింది. ఇలా మాటల్లోకి దించిన చిట్టి రోబో.. అయితే తనతో వచ్చేయండి అంటూ అక్కడున్న 12 పెద్ద రోబోట్‌లను తన వెంట తీసుకుని వెళ్లింది. అలా చిన్న రోబో ముందు వెళ్తుండగా.. దాని వెనకాలే మిగిలిన 12 పెద్ద రోబోలు వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇదంతా కల్పితమని అందరూ భావించారు. కానీ ఈ వీడియో కల్పితం కాదని, నిజమేనని రెండు రోబో కంపెనీలు తెలపడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Food Poisoning: నారాయణపేటలో ఘోరం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత