Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

New Update
us

stcok Markets shaking

అమెరికా అధ్యక్షుడు ఐరోపాను తల్లకిందులు చేసేస్తున్నారు. గ్రీన్ ల్యాండ్ కు మద్దతుగా ఉన్న దేశాల్నింటి మీదా విరుచుకుపడుతున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు.  ఫ్రాన్స్ పై 200 శాతం సుంకాలను విధిస్తానని బెదిరించారు. చాగోస్‌ను మారిషస్‌కు అప్పగించాలని బ్రిటన్‌ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వీటిపై ఐరోపా దేశాలూ దీటుగానే స్పందిస్తున్నాయి. ప్రతి సుంకాలను ప్రకటిస్తామని హెచ్చరించాయి. దీంతో ఈయూ, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. జీ7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయిపోయాయి. మన దేశంలో స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలిపోయాయి. మొత్తం రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు నష్టపోయి 90.97 వద్ద ముగిసింది. అంతకుముందు 91.06కు చేరింది కూడా. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు 0.09% పెరిగి 63.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

విదేశీ పెట్టుబడిదారులు అమ్మేస్తున్నారు..

 విదేశీ పెట్టుబడిదారులు (FPIలు) భారత స్టాక్ మార్కెట్ నుండి తమ నిధులను నిరంతరం ఉపసంహరించుకుంటున్నారు. జనవరి 2026 మొదటి 20 రోజుల్లోనే, వారు ₹29,315 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకున్నప్పుడు, వారు రూపాయలకు బదులుగా డాలర్లను డిమాండ్ చేస్తారు. డాలర్‌కు ఈ పెరిగిన డిమాండ్ దాని విలువ పెరగడానికి, రూపాయి పడిపోవడానికి కారణమవుతోంది. మరోవైపు బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.9.86 లక్షల కోట్లు తగ్గి, రూ.455.82 లక్షల కోట్ల కు పరిమితమైంది. సోమ, మంగళవారాల్లో కలిపి రూ.12 లక్షల కోట్ల విలువను మదుపర్లు కోల్పోయారు. జనవరి 20వ తేదీ, సెన్సెక్స్ 1,065 పాయింట్లు (1.28%) పడిపోయి 82,180 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 353 పాయింట్లు (1.38%) పడిపోయి 25,233 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,500 దగ్గర 100 పాయింట్లు క్షీణించింది. మార్కెట్ మొదటి కొన్ని గంటల్లో కోలుకోవడానికి ప్రయత్నించింది.. కానీ మధ్యాహ్నం నాటికి, ఐటీ, ఫార్మాస్యూటికల్స్,  బ్యాంకింగ్ వంటి రంగాలలో అమ్మకాలు తీవ్రమయ్యాయి. NSE నిఫ్టీ రియాల్టీ సూచీ 5% పడిపోయింది. ఆటో, ఐటీ సూచీలు 2% కంటే ఎక్కువ పడిపోయాయి. మునుపటి సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇది మే 13, 2025 న జరిగింది. ఇది 1,281 పాయింట్లు తగ్గి 81,148 వద్ద ముగిసింది. 

Advertisment
తాజా కథనాలు