![karnataka court](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/0KG66DlIDBWNtKRuzCrj.jpg)
America: అమెరికాలోని ఓర్లాండ్ లోని ఓ పార్క్‌లో ఫ్రీ పాల్ టవర్ నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి ఫ్లోరిడా లోని న్యాయస్థానం సంచలనమైన తీర్పునిచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. టైర్ సాంప్సన్ (14) అనే బాలుడు 2022 లో తన ఫుట్ బాల్ టీమ్ తో కలిసి ఐకాన్ పార్క్ కు వెళ్లాడు.
Also Read: సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
ఆ సమయంలో ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. ఒక రైడ్ లో 129 కిలో గ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు. అయితే సాంప్సన్ బరువు 173 కిలో గ్రాములు. బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలుడిని రైడ్ కు వెళ్లేందుకు అనుమతించారు. అయితే రైడ్ సమయంలో సాంప్సన్ పెట్టుకున్న సీటు బెల్టు ఊడిపోవడంతో అతడు 70 అడుగుల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: 'పుష్ప2' లో సుక్కు చేసిన పనికి ఫ్యాన్స్ హర్ట్..ఏకంగా సినిమానే బ్యాన్?
ఈ క్రమంలోనే బాధితులు ఫ్లోరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కార్పొరేషన్ల నిర్లక్ష్యం వల్లే సాంప్సన్ మృతి చెందారు. రైడ్ కు సంబంధించిన తయారీ దారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే దృష్టిసారించారు.అందువల్లే ఓ బాలుడు మృతి చెందాడు.దీనికి తగిన పరిణామాలు వారు ఎదుర్కోవాలి అని బాధితుల తరుఫు న్యాయవాదులు వాదించారు.
Also Read: నల్గొండకు సీఎం రేవంత్.. చిరకాల స్వప్నం నెరవేరిందంటూ వెంకట్ రెడ్డి ఎమోషనల్!
విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.మృతుడి కుటుంబ సభ్యులకు 310 మిలియన్ డాలర్లు అంటే 2,624 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్లు, భద్రత విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఈ తీర్పునిస్తున్నట్లు అందులో వెల్లడించింది.
Also Read: గిన్నిస్ రికార్డులోకి హైదరాబాదీ భారీ కేక్.. ఎన్ని కిలోలంటే?
దీంతో రైడ్ తయారీ, నిర్వాహక సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 155 మిలియన్ డాలర్లు చొప్పున అందించనున్నారు.