హైదరాబాద్‌కు చెందిన ఓ బేకింగ్ కంపెనీ భారీ కేక్‌ను తయారు చేసింది. హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ 2254 కిలోల పెద్ద రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాదాపుగా 200 మంది చెఫ్‌లు మూడు నెలల పాటు కష్టపడి ఈ కేక్‌ను తయారు చేశారు. భారీ మొత్తంలో తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ ఉపయోగించి ఈ భారీ కేక్‌ను తయారు చేశారు.
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
At Harley’s where they are aiming for Guinness World Records with 3,000 kg Russian Medovik Honey Cake pic.twitter.com/aSI6WTpzSX
— Pinku (@pinkutalks) December 6, 2024
ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
దాదాపు రూ.25 లక్షలు ఖర్చు పెట్టి..
ఈ కేక్‌ను కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు రిషినాథ్, నిఖిల్ శుక్లాలు గుర్తింపు సర్టిఫికేట్‌ను హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ సీఈఓ సురేశ్‌కు అందజేశారు. ఈ అతిపెద్ద భారీ కేక్ కోసం ఫైన్ బేకింగ్ కంపెనీ దాదాపుగా రూ.25 లక్షలు ఖర్చు చేసిందట. ఈ కేక్ మొత్తం 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుతో తయారు చేశారు. అయితే ఈ భారీ కేక్‌ను అనాథ పిల్లలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తారట. వీరితో పాటు వినియోగదారులకు కూడా ఈ కేక్‌ను ఇస్తారట.
ఇది కూడా చూడండి: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!
3000 KG cake pic.twitter.com/v3d6JjraxP
— Pinku (@pinkutalks) December 6, 2024
ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం
Also Read: సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..!