XAI Grok: ఎక్స్‌ఏఐ చాట్‌బాట్‌ బూతులు.. కేంద్రం కీలక నిర్ణయం

ఇటీవల కొంతమంది యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌ చాట్‌బాట్‌ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై ఎక్స్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది.

New Update
XAI Grok

XAI Grok

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ(XAI) గ్రోక్‌ ఏఐ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవల కొంతమంది వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌ చాట్‌బాట్‌ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఇది సోషల్‌ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. 

Also Read: వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్

కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ.. ఈ గ్రోక్‌ వివాదంపై ఎక్స్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు యత్నిస్తు్న్నామని అధికారులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ ఈ గ్రోక్‌ చాట్‌బాట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ భూమిపై అత్యంత తెలివైన ఏఐ టూల్‌ అని ఎలాన్ మస్క్‌ అన్నారు. అయితే ఇటీవల యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్‌ ఇచ్చిన సమాధానాలు అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి.    

హిందీ యాసను కూడా ఈ ఏఐ చాట్‌బాట్ వినియోగించడం విశేషం. ఇటీవల కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు  కొన్ని అభ్యంతరకర పదాలు వాడటం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది.  తాజాగా టోకా అనే ఎక్స్‌ యూజర్‌ మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

Also Read: త్వరలో టోల్‌ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ‘నా బెస్ట్‌ 10 మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?’ అని టోకా ప్రశ్నించగా. గ్రోక్‌ సమాధానం ఇవ్వకపోవడంతో  హిందీలో తిట్టాడు. దంతో గ్రోక్‌ ఆ తిట్టుకు స్పందించడమే కాకుండా తిరిగి అదే తిట్టుతో సదరు వ్యక్తిని తిట్టింది. గ్రోక్‌ స్పందిస్తూ..  ‘‘కూల్‌... మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ అంటే ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. నీ బెస్ట్‌ 10 మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఎవరో నాకు తెలిసింది" అంటూ రిప్లై ఇచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు