BIG BREAKING: నేపాల్ ఉద్రిక్తతలో 9 మంది మృతి

సోషల్‌ మీడియాపై నిషేధంపై నేపాల్ యువత రోడ్లెక్కారు. ఆ ఉద్రిక్తత హింసకు దారితీసింది. సోమవారం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మందికిపైగా గాయపడ్డారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

సోషల్‌ మీడియా నిషేధంపై నేపాల్ యువత రోడ్లెక్కారు. ఆ నిరసన హింసకు దారితీసింది. సోమవారం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు ఎంత చెప్పినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మందికిపైగా గాయపడ్డారు.

నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. తమ దేశంలో రిజిస్టర్ చేసుకోని, స్థానిక నియమాలకు కట్టుబడి లేని సంస్థలపై ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నేపాల్ సుప్రీం కోర్టు కూడా సోషల్ మీడియా సంస్థలు దేశ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది యువతను ఆగ్రహానికి గురిచేసింది.

సోమవారం, రాజధాని ఖాట్మండుతో పాటు దేశంలోని పది ప్రధాన నగరాల్లో యువత భారీ ర్యాలీలు నిర్వహించారు. 'జెన్ Z విప్లవం' పేరుతో ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలతో వారి మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ఉపయోగించారు. ఈ కాల్పుల్లో 9 మంది చనిపోగా, పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ కేవలం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేయడం మాత్రమే కాదు, దేశంలో పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలుపుతున్నారు. "సోషల్ మీడియాను నిషేధించకండి, అవినీతిని నిషేధించండి" అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అదనపు సైనిక బలగాలను కూడా మోహరించారు. ఈ ఘటనతో నేపాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు